బిగ్ బాస్ ట్విస్ట్ నాగార్జున రివీల్..!
on Oct 5, 2024
బిగ్ బాస్ ప్రేక్షకులకు వారంలో రెండు రోజుల కోసం తెగ ఎదురు చూస్తుంటారు. ఒకటి నామినేషన్.. రెండోది శనివారం నాగార్జున చురకలు అంటించే వీడియో.. అయితే అయితే ఈ వారం వీకెండ్ రానే వచ్చింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటు ఆదిత్య ఓమ్ బయటకు వచ్చేసాడు.
ఇక మధ్యలో వెళ్లిన వారికి జర్నీ వీడియో ఇంకా ఎగ్జిట్ ఇంటర్వ్యూ లాంటివి ఉండవు. మిడ్ వీక్ జరిగిన గత సీజన్ కంటెస్టెంట్ కి అన్యాయం జరిగింది. ఈ సారి కూడా ఆదిత్య ఓమ్ కి అలాగే అన్యాయం జరిగిందని అనుకున్నారంతా కానీ అనుకోకుండా వీకెండ్ ప్రోమోలో ఆదిత్య ఓమ్ నాగార్జున తో స్టేజ్ మీద ఉన్నాడు. ఇది ఎవరు ఊహించి ఉండరు.
బిగ్ బాస్ ప్రోమోలో ఆదిత్య స్టేజ్ పై కన్పించాడు. సండే రోజు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లాగే హౌస్ మేట్స్ ఒక్కక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అన్నా టీవీలో బాగున్నావు అన్నా అని సీత అనగానే.. అంటే బయట బాగోనా అని ఆదిత్య సెటైర్ వేసాడు. ఆదిత్యని హౌస్ మేట్స్ కి హగ్ పంచ్ ఇవ్వాలని నాగార్జున చెప్తాడు. నబిల్ కి హగ్ ఇచ్చి.. మీరు బిగ్ బాస్ గెలిస్తే ఆదిత్య ఓమ్ గెలిచినట్లే అని అంటాడు. పృథ్వికి హగ్ ఇస్తూ నిజంగా వారియర్ అఫ్ ది హౌస్ అని చెప్పాడు. యష్మీకి పంచ్ ఇస్తూ ఓక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆదిత్య ఓమ్ ఎలాగా ఉండేవాడో మిమ్మల్ని చూస్తున్నాను.. అన్ బయాస్డ్ గా ముఖ్యంగా మీరు నామినేషన్ లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని యష్మీకి చెప్తాడు.
ఆ తర్వాత నేను రియల్ సీతని చూడాలి అనుకుంటున్నానని ఆదిత్య అంటాడు. మీ అందరికి ఒక సీక్రెట్ రివీల్ చెయ్యాలి. ఈ స్టేజ్ మీద నుండి వెళ్ళిపోబోతున్న ఆదిత్య అని నాగార్జున అనగానే.. కంటెస్టెంట్స్ అందరు షాకింగ్ గా నిల్చుంటారు. ఆదిత్య ఈజ్ బ్యాక్ అని చెప్పి ఉంటారు. అందుకే షాక్ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆదిత్య ఓం మళ్ళీ హౌస్ లోకి వస్తున్నాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.
Also Read